మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నెక్ట్స్ సీఎం ఎవరన్నదానిపై చర్చ మొదలైంది. ఆ పదవి మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ కి దక్కుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 200కి పైగా సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. దీంతో మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం పదవి దేవేంద్ర ఫడ్నవీస్ కి దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాస్కులే భేటీ కానున్నారు. మరోవైపు బీజేపీ అగ్ర నాయకత్వం రేపు ముంబయికి కేంద్ర పరిశీలకును పంపనున్నట్టు తెలుస్తోంది. వారు కూటమి పార్టీలతో చర్చలు జరుపుతారు. ఈ నెల 28తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి 72 గంటల్లోకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో మాజీ సీఎం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కూటమిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయాగా.. విపక్ష ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన(ఉద్ధవ్) 95, ఎన్సీపీ(ఎస్పీ) 86 సీట్లలో బరిలో దిగగా.. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే, కూటమి తొలి విజయాన్ని దక్కించుకుంది. వడాలలో 59,764 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కాళిదాస్ నీలకంఠ్ గెలుపొందారు.