HomeInternationalCHINA: ఇంజనీరింగ్ అద్బుతం

CHINA: ఇంజనీరింగ్ అద్బుతం

Published on

spot_img

గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… చైనా మరోసారి ఇంజినీరింగ్‌ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించి వారెవ్వా అనిపించుకుంది. ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం…. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ వంతెన నిర్మాణంతో గంట సమయం పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్‌ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ ‘హువాజియాంగ్‌ గ్రాండ్ కెన్యాన్‌ బ్రిడ్జి’ని నిర్మించారు. 2022లో నిర్మాణాన్ని ప్రారంభించి కేవలం మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ కోసం 280 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసారు. ఈఫిల్‌ టవర్‌ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఏడాది జూన్‌లోని ఈ వంతెనను ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం ఈ దేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Latest articles

Bhu Bharathi: ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూచట్టాలను చేసింది..!

*'ధరణి' ఎన్నో సమస్యలకు కారణమైంది.. *భూభారతి పోర్టల్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం...

Dr.BR Ambedkar: బి.ఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ (Dr....

Hyderabad: జైలులోపలికి ఫోన్…ఖైదీతో మాట్లాడిన విడియో… సోషల్ మీడియాలో వైరల్ ..

హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ...

PADI KAUSHIK REDDY: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో కుంభకోణం

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది...

More like this