వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే… అధిక ద్రవ్యోల్బణంతో సతమవుతున్న అమెరికాలో….అధిక టారీఫ్ లతో అనేక వస్తువుల ధరలకు రెక్కలు రానున్నాయి. దీంతో అమెరికన్ లు స్టోర్లకు పరుగెడుతున్నారు. ధరలు పెరుగకముందే వస్తువుల కొనుగోళ్లు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.