HomeInternationalDonald trump : అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం

Donald trump : అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం

Published on

spot_img

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయం సాధించారు. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 276 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకోగా, డెమొక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ 223 ఓట్లను మాత్రమే పొందారు. విస్కాన్సిన్‌లో గెలుపుతో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ (270) దాటాడు. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ప్రముఖ వ్యాపారవేత్త, రియాల్టీ స్టార్ నుంచి రాజకీయ స్టార్ గా ఎదిగిన ట్రంప్ గతంలోనే తొలిసారి అధ్యక్షుడు అయ్యారు. 2020లో జోబైడెన్ చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి కమలాహారిస్‌పై విజయం సాధించి… అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అత్యంత వృద్ధుడిగా నిలిచారు. ఆయన ఇప్పుడు 78 ఏళ్ల వయస్సులో రెండోసారి గెలుపొందారు.

అధ్యక్షుడిగా ఉండి ఓడిపోయిన తర్వాత… ఆ తదుపరి ఎన్నికల్లో గెలిచిన రెండో వ్యక్తి ట్రంప్. ఇప్పటి వరకు గెలిచిన వారిలో అత్యంత వృద్ధుడు ట్రంప్. ప్రస్తుతం ట్రంప్ వయస్సు 78. జోబైడెన్ 77 ఏళ్లకు గెలిచి 81 ఏళ్ల వయస్సులో అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నారు.

2016లో హిల్లరీ క్లింటన్ కంటే పాపులర్ ఓటింగ్‌లో వెనుకబడిన ట్రంప్… ఎలక్టోరల్ కాలేజీలో విజయం సాధించాడు. పాపులర్ ఓటులో ఓడి ఎలక్టోరల్ కాలేజీ ద్వారా గెలిచిన మొదటి రిపబ్లికన్ అధ్యక్షుడు ట్రంప్.

నేరారోపణలు ఎదుర్కొంటూ అధ్యక్ష పదవిలో ఉన్న మొదటి వ్యక్తి ట్రంప్. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. ఒకే టర్మ్‌లో రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్.

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this