నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై బాధిత కుటుంబం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించాడని, తమకు అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. గతంలో తాము మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి స్థలాన్ని పరిశీలించి, పాస్టర్ అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని ఆదేశించారని, అయినా తొలగించకపోగా, నకిలీ డాక్యుమెంట్లతో ఆర్మూరు కోర్టులో కేసు వేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18న ఆ కేసును కోర్టు కొట్టేసిందని, తీర్పు లింబాద్రి కుటుంబ సభ్యులకు అనుకూలంగా వచ్చిందన్నారు. ఆ కోర్టు తీర్పుతో మరోసారి మున్సిపల్ కమిషనర్ ను సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.