గాజా మరుభూమిగా మారనుందా…అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ .. మౌలిక వసతులను ధ్వంసం చేస్తుంది. నివాసయోగ్యంగా ఉన్న ప్రతి భవనాన్ని కూల్చివేస్తుంది. వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తుంది. పాలస్తీనియన్లకు నిలువనీడ లేకుండా చేయడమే ధ్యేయంగా…. మౌలిక సదుపాయాలు మళ్లీ వాడుకోలేని విధంగా తాము ధ్వంసం చేస్తున్నామని… అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు పేర్కొన్నారు. గాజాలో 50 శాతం భూభాగం ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చింది. దీన్నంతా మిలిటరీ బఫర్ జోన్‌గా సైన్యం మారుస్తోంది. హమాస్ ఓడిపోయిన తర్వాత గాజాలో భద్రతాపరమైన నియంత్రణను కలిగి ఉంటామని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వేల మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బఫర్ జోన్‌గా మార్చింది. ఈ జోన్‌లోనే వ్యవసాయ భూములూ ఉన్నాయి. నీటి వసతి సౌకర్యాలను, పంటలను, చెట్లను నాశనం చేయాలని తమకు ఆదేశాలిచ్చారని ఆ ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు.
మమ్మల్ని చంపారని ఇక్కడకు మేం వచ్చాం. ఇప్పుడు వారిని చంపుతాం. మేం కేవలం వారిని మాత్రమే చంపడం లేదు. వారి భార్యలను, చిన్నారులను, పిల్లులను, కుక్కలను కూడా చంపుతున్నాం అని…. మరో సైనికుడు తెలిపారు.