హైదరాబాద్ – హబ్సిగూడ సిగ్నల్ వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు బైకులపైకి డీసీఎం లారీ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకులపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.