వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పై బెంగళూరుకు చెందిన మరో డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రొద్దుటూరు డిపోలో పనిచేస్తున్న ఎన్.ఆర్.ఎస్.రెడ్డి డ్యూటీ నిమిత్తం నిన్న (గురువారం) బెంగళూరు వెళ్లాడు. అక్కడ పార్కింగ్ విషయంలో కర్ణాటక డ్రైవర్ తో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన కర్ణాటక డ్రైవర్ ఏపీ డ్రైవర్ పై దాడికి దిగాడు. ముఖంపై పిడిగుద్దులతోపాటు.. కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఈ ఘటనను ఏపీ డ్రైవర్స్ యూనియన్లు తీవ్రంగా ఖండించాయి. ఏపీ డ్రైవర్ పై దాడికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగుచూసింది.
Crime News: పార్కింగ్ విషయంలో వివాదం.. ఏపీ డ్రైవర్ పై కర్ణాటక డ్రైవర్ దాడి!
Published on