బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఆయన ఇల్లు ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… ఎన్నికలకు ముందు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన సిర్పూర్ పర్యటనకు వస్తే ఈ ఇంట్లోనే ఉంటారు. అయితే గత రాత్రి ఆయన నివాసంలో దొంగలు పడ్డారు. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఆ ఇంట్లోనే కొందరు బీఆర్ఎస్ నేతలు ఉంటారు. కానీ బుధవారం రాత్రి మాత్రం ఎవరూ లేరని చెబుతున్నారు. దీంతో ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. “తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్ కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోనిపోయారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా తెలంగాణ డీజీపీని కోరుతున్నాను” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.
దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.
My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024