HomeTelanganaTelangana: మెడికల్, నర్సింగ్ కళాశాల హాస్టళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి...

Telangana: మెడికల్, నర్సింగ్ కళాశాల హాస్టళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

Published on

spot_img

* వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాలలోని హాస్టళ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య, ఆరోగ్య , ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో DMHO, TGMSIDC ఇంజనీరింగ్ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సంబంధిత శాఖల అధికారులతో వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణం పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థుల వసతి గృహం నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదుల నిర్మాణం, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆందోల్ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణంతోపాటు విద్యార్థుల వసతి గృహం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆందోల్ ను మెడికల్ హబ్ గా రూపొందించడంలో భాగంగా వట్పల్లి, కంకోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం పనులు వెంటనే పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.

Latest articles

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...

KHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ...

More like this