HomeNationalKHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

KHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

Published on

spot_img

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నారని…. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ భావజాలానికి వ్యతిరేకమంటూ విమర్శించారు.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భావజాలానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు వ్యతిరేకమని….స్వాతంత్ర్య సమరంలో ఏ మాత్రం పాలు పంచుకోని వాళ్లు.. ఇప్పుడు పటేల్‌ వారసులంటూ ప్రకటించుకోవడం హస్యాస్పదమని ఖర్గే అన్నారు. భాజపా- ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నాయని… దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ 140 ఏళ్లుగా… దేశ సేవలో నిమగ్నమైందని…స్వాతంత్ర్య సమరంలో ఎంతో పోరాడిందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆ నేతలిద్దరు దేశం కోసం కలిసికట్టుగా పని చేశారు. అలాంటిది.. ఆ నాయకులు ఒకరితో మరొకరు వ్యతిరేకంగా ఉండేవారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని …. మండిపడ్డారు.

నెహ్రూ- పటేల్‌ మధ్య నిత్యం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. అన్ని విషయాలపై నెహ్రూ ఆయన సలహాలు తీసుకునే వారు. పటేల్‌ అంటే ఆయనకు అమితమైన గౌరవం. ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే స్వయంగా నెహ్రూనే పటేల్ ఇంటికి వెళ్లేవారు. పటేల్‌ సౌలభ్యం దృష్టి ఉంచుకుని సీడబ్ల్యూసీ సమావేశాలు ఆయన ఇంట్లోనే నిర్వహించేవారు. అలాంటి గొప్ప నాయకులపై భాజపా- ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయి…. అని ఆరోపించారు.

Latest articles

Bhu Bharathi: ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూచట్టాలను చేసింది..!

*'ధరణి' ఎన్నో సమస్యలకు కారణమైంది.. *భూభారతి పోర్టల్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం...

Dr.BR Ambedkar: బి.ఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ (Dr....

Hyderabad: జైలులోపలికి ఫోన్…ఖైదీతో మాట్లాడిన విడియో… సోషల్ మీడియాలో వైరల్ ..

హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ...

PADI KAUSHIK REDDY: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో కుంభకోణం

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది...

More like this