HomeTelanganaKtr : నన్ను అరెస్ట్ చేయాలని కుట్రలు... పోరాటాలకు సిద్ధం కండి: కేటీఆర్

Ktr : నన్ను అరెస్ట్ చేయాలని కుట్రలు… పోరాటాలకు సిద్ధం కండి: కేటీఆర్

Published on

spot_img

హైదరాబాద్ : ఏదో ఒక కేసులో తనను ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో దీనిపై పార్టీ నేతలు చర్చించారు. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తే భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిందని, తనను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని చెప్పారు. ఏదో ఒక కేసులో తనను అరెస్ట్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. పోరాటాలు తమకేమీ కొత్తకాదన్నారు.

మరోవైపు లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కుట్రపూరితంగా నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయించారన్నారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందన్నారు. ఈ అరెస్ట్ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రేవంత్ నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్ఎస్ చేసిందని అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. తమపై కోపం ఉంటే తమని అరెస్టు చేయాలని, అమాయకులైన గిరిజన రైతులపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this