HomeInternationalCHINA: హోటల్లే బెటర్‌ అంటున్న చైనీస్‌ యువత

CHINA: హోటల్లే బెటర్‌ అంటున్న చైనీస్‌ యువత

Published on

spot_img

చదువు కోసమో… ఉద్యోగాల కోసమో… మనము ఒక ప్రాంత నుంచి మరో ప్రాంతానికి వెళ్తాం. అక్కడ ఉండేందుకు అద్దె ఇల్లును తీసుకుంటాం. కానీ హోటళ్ళో ఉండటానికి ఇష్టపడం ఎందుకంటే…హోటల్ లో పెట్టే ఖర్చు చాలా ఎక్కవ మొత్తం కనుక. కానీ చేైనాలో మాత్రం ఇందుకు భిన్నంగా
హోటల్ లో పెట్టే ఖర్చు అద్దె ఇంటికన్నా చాలా తక్కువగా ఉండటం వల్ల , వాళ్ళు హోటళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు.

అద్దె ఇంటికయితే.. యజమానితో ఒప్పందాలు చేసుకోవాలి.. వారి నిబంధనలు అంగీకరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నిర్వహణ ఖర్చులు అదనం. అదే హోటల్‌ అయితే.. అవన్నీ హోటల్‌ సిబ్బందే చూసుకుంటారు. వచ్చామా.. తిన్నామా.. పడుకొని.. ఉదయమే ఆఫీసు/కాలేజీకి వెళ్లామా అన్నట్లుగా ఉంటుంది. గదిని శుభ్రం చేయాల్సిన పని లేదు.. నిర్వహణ ఖర్చులు అస్సలు లేవు. వీకెండ్స్‌లో సరదాగా బయటకు వెళ్లాలనుకుంటే థియేటర్లు, కెఫెలు, పార్క్స్‌ హోటల్స్‌ దగ్గర్లోనే ఉంటాయి. అందుకే, ఒంటరిగా ఉండే ఉద్యోగులు, విద్యార్థులంతా.. హోటల్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

టియాంజిన్‌లో ఒక వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుంటే నెలకు 3 వేల యువాన్లు. అదనపు ఖర్చులతో దాదాపు 3,500 యువాన్లు అవుతోంది. అదే ఎక్కువకాలం నివాసం ఉండేలా హోటల్స్‌తో ఒప్పందం చేసుకుంటే నెలకు 2,500 యువాన్లు చెల్లిస్తే సరిపోతుంది. మారియట్‌ షాంఘై లాంటి లగ్జరీ హోటల్స్‌లో గది తీసుకుంటే నెలకు 10వేల యువాన్లు ఖర్చు అవుతుందట. అదే షాంఘైలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంటే అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు యువతను హోటల్స్‌ వైపు ఆకర్షిస్తోంది.

Latest articles

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

REVANTH REDDY: పార్టీ గీత దాటితే… వేటు తప్పదు: సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. పార్టీ నిర్ధేశించిన నియమాలకు...

More like this