డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు… ఆ డబ్బు ఎక్కడ దొరికితే… అక్కడికి వెళ్లుతున్నారు ,
ఆ డబ్బు కోసమే రష్యా సైన్యంలో చేరి మోసపోయాడు చైనా పౌరుడు.
రష్యా సైన్యంతో….కలిసి పోరాటం చేస్తున్న ఇద్దరు చైనా పౌరులను తమ దళాలు పట్టుకొన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మాస్కో సైన్యంలోకి తాను ఎలా వచ్చాననే విషయాన్ని చైనా పౌరుడు వాంగ్ గ్వాంగ్జున్ వెల్లడించాడు. తనకు సులభమైన ఉద్యోగంతో పాటు మంచి జీతం ఇస్తానని ఆశ చూపించి సైన్యంలోకి తీసుకున్నట్లు తెలిపాడు.
చైనాకు చెందిన నేను మొదటగా….అక్కడి పునరావాస కేంద్రంలో థెరపిస్ట్‌గా పనిచేశాను . ఉద్యోగం కోల్పోయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడిపాను . ఆ సమయంలో ఉక్రెయిన్‌తో పోరాడుతున్న రష్యా సైనికుల గురించి వీడియోలు ఎక్కువగా టిక్‌టాక్‌లో ప్రత్యక్షమయ్యేవి. మాస్కో సైనికులు కనిపించిన తీరు చూసి మోసపోయాను. ఆ దేశానికి చెందిన రిక్రూటర్ సైన్యంలో మంచి ఉద్యోగంతో పాటు నెలకు 2వేల నుంచి 3వేల డాలర్ల వరకు (భారత కరెన్సీలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా) జీతం ఇస్తానని ఆశ చూపించాడు. దాంతో అది నిజమేనని నమ్మి మాస్కోకు వెళ్లగా.. మొత్తం తలకిందులైంది. నా బ్యాంకు కార్డు, ఫోన్‌ను వారు స్వాధీనం చేసుకొని సైనిక శిక్షణా శిబిరానికి పంపారు. శిక్షణ తర్వాత సరిహద్దుకు తరలించారని తెలిపారు.