HomeAndhra PradeshPawan kalyan: డ్రగ్స్ మాఫియాపై కేంద్ర హోంశాఖ స్పందించాలి..!

Pawan kalyan: డ్రగ్స్ మాఫియాపై కేంద్ర హోంశాఖ స్పందించాలి..!

Published on

spot_img

– ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్రగ్స్ విష‌య‌మై ‘ఎక్స్’ (ట్విట్టర్‌) వేదిక‌గా స్పందించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చిందని, ఇదే ఇప్పుడు రాష్ట్రానికి పెనుముప్పుగా మారిందని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

“రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కొంతకాలం క్రితం విశాఖపట్నంలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజ‌య‌వాడ‌లోని ఒక వ్యాపార సంస్థలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.

గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది. నేర‌గాళ్లను క‌ట్టడి చేసేందుకు కేంద్రం చ‌ర్యలు తీసుకోవాలి. దీనికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం” అని జ‌న‌సేనాని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this