HomeTelanganaRevanthreddy: తాగుబోతోడు జాతిపిత అవుతాడా?

Revanthreddy: తాగుబోతోడు జాతిపిత అవుతాడా?

Published on

spot_img

* జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్

* అసెంబ్లీకి రానోడికి ప్రతిపక్ష హోదా ఎందుకు?

* కేసీఆర్ వస్తే..ప్రాజెక్టులపై చర్చించడానికి నేను సిద్ధం..

* మీరు కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం

* సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

స్టేషన్ ఘనపూర్: కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంట… ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత. లక్ష కోట్లు దోచుకున్నోడు, తాగుబోతోడు.. రాష్ట్ర ప్రజల రక్తం తాగినోడు తెలంగాణ జాతిపిత అవుతాడా..? అంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ అవుతారు తప్ప.. ఫాంహౌస్ లో తాగి పడుకునే కేసీఆర్ ఎప్పటికీ కాలేడన్నారు.

స్టేషన్ ఘనపూర్ లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు తీసుకొస్తానని లోక్ సభ ఎన్నికల సందర్భంగా మాటిచ్చాను.. చెప్పినట్టుగానే ఎయిర్ పోర్ట్ సాధించుకొచ్చానని చెప్పారు.

ధనిక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ కు అప్పగిస్తే..దివాళా రాష్ట్రంగా మాకు అప్పగించాడని కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ రూ.8.29లక్షల అప్పును మా నెత్తిన పెట్టి పోయాడన్నారు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం రూ.84వేల కోట్లు వడ్డీ, రూ.64వేల కోట్లు అసలు చెల్లించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, ఇందుకోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు కింద రూ.7,200 కోట్లు ఇచ్చామని చెప్పారు. గ్రూప్ 1,2,3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలిస్తున్నామన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలి ఇచ్చింది నేను కాదా.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చాడా అని ప్రశ్నించారు సీఎం. తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీహరి అవసరం ఉందని పార్టీకి తీసుకొచ్చామన్నారు.

హరీశ్ రావు తాటిచెట్టులా పెరిగాడు గానీ, ఆవకాయంత కూడా మైండ్ లేదన్నారు సీఎం. ప్రాజెక్టులన్నీ కేసీఆర్ కట్టినట్టు చెబుతున్నాడు.. మీరు కట్టింది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. ప్రాజెక్టులన్నీ మీ తాత కట్టాడా అని ప్రశ్నించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. మీరు కాదు.. పిల్ల కాకులతో నాకెందుకు గానీ, అసలు ఆయన్ను రమ్మనండి నేను మాట్లాడతా..? అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా.. అందుకే ఆయనకు మొఖం చెల్లక ఫాం హౌస్ లో దాక్కుని.. వీళ్లను ఉసిగొల్పుతున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు.

ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి మాత్రం రావడం లేదన్నారు రేవంత్ రెడ్డి. అధికారం ఉంటేనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకునే వ్యక్తి ప్రజల కోసం అసెంబ్లీలో సూచనలు ఎందుకు చేయడం లేదన్నారు సీఎం. తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించడం లేదన్నారు. కేసీఆర్ బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వరంగల్ కు ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు వచ్చాయన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్న సీఎం.. జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసింది తమ ప్రభుత్వమని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ చేసిన తప్పులన్నీ బయటపెడతానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...