* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు..
* బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు
* మంత్రి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం
పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పులివెందులలో ఇవాళ జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇరువర్గాలకు చెందిన వారు తన్నుకున్నారు. పార్టీ జిల్లా ఇన్ఛార్జ్, మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఆమె సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. వేదికపై రాంగోపాల్ రెడ్డి ఉండకూడదని, వేదిక దిగిపోవాలని బీటెక్ రవి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో రాంగోపాల్ రెడ్డి వర్గీయులు కూడా పోటీపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం విస్తృతస్థాయి సమావేశం సజావుగా కొనసాగింది.
పులివెందులలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట.
మంత్రి @MinisterSavitha ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. తమ్ముళ్ల కుమ్ములాటపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
మంత్రి సవిత ఎంత సర్ది చెప్పిన వినని తమ్ముళ్లు… pic.twitter.com/ixjWCe3OFx
— INDIAN REPUBLIC TV (@irmediatv) April 8, 2025