ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు భట్టివిక్రమార్క కూడా ఉన్నారు.
అయితే, భట్టి విక్రమార్క ఇప్పటికే ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అక్కడి నేతలతో సమావేశమవుతున్నారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. ఝార్ఖండ్‌లో తన పర్యటనకు సంబంధించి భట్టివిక్రమార్క ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బోకారోలో ఓ చాయ్ దుకాణంలో టీ తాగారు. వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.
Over a steaming cup of chai, I connected with a tea shop vendor in Bokaro, Jharkhand! Listening to their concerns and sharing our vision for a brighter future.
#JharkhandAssemblyElections @INCJharkhand_ @INCIndia @INCTelangana pic.twitter.com/fClkY0DJjf
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 31, 2024