సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ కు చెందిన కృష్ణవేణి… గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇవాళ కృష్ణవేణి దగ్గరకు ఆమె తల్లి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో గడిపింది. తల్లి వెళ్లాక ఏమైందో, ఏమో.. తెల్లవారుజామున కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకేసింది. బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమా..? లేక కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.