తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని ఆగ్రహించిని అమ్మాయి తరఫు బంధువులు టెన్త్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివకిషోర్ అనే విద్యార్థి అదే గ్రామంలో టెన్త్ చదువుతున్నాడు. తన తోటి విద్యార్థినికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు శివకిషోర్ పై దాడి చేశారు. శివకిషోర్ ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది.