* రాష్ట్రాల జీఎస్ డీపీని లెక్కగట్టిన కేంద్ర ప్రభుత్వం
* అత్యధిక స్థూల జాతీయోత్పత్తితో టాప్ లో ఉన్న మహారాష్ట్ర
* ఇటీవల గణాంకాలు విడుదల చేసిన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి
దేశంలోని రాష్ట్రాల జీఎస్డీపీని కేంద్ర ప్రభుత్వం లెక్కకట్టింది. టాప్ టెన్ జాబితాలో తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. వ్యవసాయం నుంచి భారీ పరిశ్రమల దాకా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరిగిపోతోంది. ఆయా రాష్ట్రాల భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రభుత్వ పరిపాలన విధానాలు ఈ అభివృద్ధికి దోహదపడుతుంటాయి. మరి మన దేశంలో ‘రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్ డీపీ)’ ఆధారంగా ధనిక రాష్ట్రాలను పరిశీలిస్తే… ఇటీవల ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం…టాప్ టెన్ లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా స్థానాలు దక్కించుకున్నాయి. ఈ టాప్ టెన్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకూ చోటు దక్కింది.