గత కొద్ది రోజుల నుండి చత్తీస్ గడ్ ప్రాంతం ఎన్ కౌంటర్ లతో దద్దరిల్లుతోంది. సోమవారం ఉదయం దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు రేణుక మరణించినట్లు ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు . దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించారు. చైతుది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం కాగా… ఆమె 35 ఏళ్ల క్రితమే పార్టీలోకి వెళ్లారు.
LLB వరకు చదివిన రేణుక తిరుపతి లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే …. అటు మహిళా సంఘం లో పనిచేస్తూ…. అప్పటి,ఇప్పటి ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడి పై అలిపిరి దాడి అనంతరం రేణుక మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోయారు. అనంతరం ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఎన్ కౌంటర్ లో మరణించిన తర్వాత మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావుకు సహచరినీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
రేణుక మరణంతో కడవెండి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రేణుక తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాదులోని నాగారంలో ఉంటున్నట్లు సమాచారం. తల్లి దండ్రులు రేణుక మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులతో కలిసి చత్తీస్ గడ్ వెళ్ళినట్లు తెలిసింది.