భూకంప ప్రళయానికి… మయన్మార్ లో మృత్యుఘోష కొనసాగుతూనే …ఉంది.
ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాలు, వాటికింద శవాల దిబ్బలు….బంధువుల రోదనలు…
మధ్యాహ్నం సమయంలో… రంజాన్ వేళ ప్రార్థనలు చేస్తుండగా… ఈ విపత్తు రావడంతో ఓ మసీదు శిథిలాల కిందే 700 మందికి పైగా సజీవ సమాధి అయినట్లు తెలుస్తుంది. అయితే, వీరి మరణాలను మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం వెల్లడించిన మృతుల సంఖ్యలో చేర్చారా లేదా? అనేది తెలియాల్సి వుంది.
మయన్మార్‌లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో గత శుక్రవారం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకంపనల ధాటికి 60 మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని స్ప్రింగ్ రివల్యూషన్ మయన్మా్‌ర్ ముస్లిం నెట్‌వర్క్ కమిటీ సభ్యుడు టున్ కీ వెల్లడించారు.