ముచ్చటగా…మూడో సారి అమెరికా అద్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మూడోసారి బాధ్యతలు చేపట్టడానికి అయిష్టత చూపలేదు. తాను జోక్ చేయడం లేదని…. దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదని తెలిపారు. ఆదివారం ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని… నన్ను కోరుతున్నారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికి చెప్పాను. దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని… ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా…. అని ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా.. అని ప్రశ్నించగా.. తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ తప్పనిసరి . రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడొంతుల రాష్ట్రాలు ఆమోదించాలి.