HomeCrimeCrime News: కూతురిని ప్రేమించాడని కిరాతకంగా హత్య!

Crime News: కూతురిని ప్రేమించాడని కిరాతకంగా హత్య!

Published on

spot_img

* పుట్టిన రోజు నాడే.. అమ్మాయి తండ్రి ఘాతుకం

* కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబం

తెలంగాణలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమించినందుకు కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడో తండ్రి. దీంతో బాధిత యువకుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేర్వేరు కావడంతో వీరి ప్రేమకు యువతి తండ్రి అభ్యంతరం చెప్పాడు. ఇక నుంచి తన కూతురితో మాట్లాడొద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు. అయినా.. అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన యువతి తండ్రి ఎలాగైనా సాయికుమార్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిన్న రాత్రి (గురువారం) 10 గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి కూర్చొని ఉండగా.. యువతి తండ్రి గొడ్డలితో వచ్చి అకస్మాత్తుగా దాడి చేశాడు. విచక్షణారహితంగా సాయికుమార్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సాయికుమార్ స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటీన సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు.

సాయికుమార్ మృతి వార్త పెద్దపల్లి జిల్లాతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సాయికుమార్ కుటుంబ సభ్యులు

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this