HomeTelanganaSeethakka: భర్త వర్ధంతి సభలో భావోద్వేగం.. సీతక్కను ఓదార్చిన విమలక్క..!

Seethakka: భర్త వర్ధంతి సభలో భావోద్వేగం.. సీతక్కను ఓదార్చిన విమలక్క..!

Published on

spot_img

తెలంగాణ మంత్రి సీతక్క తన జీవితంలోని కష్టాలను, ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్త కుంజ రాము వర్ధంతి సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. భర్త స్మృతులతో కదిలిపోయారు. కన్నీటిపర్యంతమైన ఆమెను విమలక్క ఓదార్చారు.

ఒకప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, అది తనకు పునర్జన్మ అని సీతక్క అన్నారు. ఈ జన్మలో పేదలు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడతానని ఆమె పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతక్క తన కుమారుడు సూర్య, కోడలు కుసుమాంజలితో కలిసి భర్త కుంజ రాము స్తూపం వద్ద నివాళులర్పించారు. రాము 17 ఏళ్ల వయసులోనే ఉద్యమంలో చేరి ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారని, ఆయన ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు. రాము నేర్పిన విలువలు, నైతికతతోనే తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని సీతక్క పేర్కొన్నారు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this