శుక్రవారం మయన్మార్ లో వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోయారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా…రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది.
మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో… 10 కిలోమీటర్ల లోతున…. భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారమ్ మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు పేక మేడల్లా నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా..? శిథిలాల కింద చిక్కుకుపోయారా…? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం..
కుప్పకూలిన భవనాలు 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం..
ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో పేకమేడల్లా కుప్పకూలిన భారీ భవనాలు…
తీవ్ర భయాందోళనతో ఇళ్లు, ఆఫీస్‌ల నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు pic.twitter.com/zHBv8nL9h0
— INDIAN REPUBLIC TV (@irmediatv) March 28, 2025