ట్రంప్ అధికారంలో కి వచ్చినప్పటీ నుండి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను పంపించివేయడమే కాకుండా….అమెరికాకు అక్రమంగా వచ్చే వారిని కూడా అడ్డుకునేందకు అడ్డుకట్టవేస్తోంది. తాజాగా భారత్‌లో 2,000 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ‘బాట్స్’సాయంతో మోసపూరితంగా ఈ అపాయింట్‌మెంట్లను ఏజెంట్లు బ్లాక్ చేసి విక్రయించడమే కారణమని తెలుస్తుంది. ‘బాట్స్ ద్వారా అక్రమంగా తీసుకున్న 2,000 వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని కాన్సులర్ బృందం రద్దు చేసింది. షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లను సహించమని తెలియజేసింది. ఈ అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతోపాటు.. అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం బీ1, బీ2, స్టూడెంట్ వీసాల అపాయింట్‌మెంట్ల కోసం చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కానీ ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే కేవలం నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్లు దొరుకుతున్నాయి. ఇందుకోసం ఒక్కో వీసా దరఖాస్తుదారుడి నుంచి రూ.30,000 నుంచి రూ.35,000 వరకూ ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. సాధారణంగా వీసా దరఖాస్తుదారు సొంతంగా దరఖాస్తు చేస్తే.. తొందరగా.. అపాయింట్‌మెంట్ లభించదు. కానీ ఏజెంట్లు కొన్ని ప్రత్యేకమైన బాట్స్‌ను వినియోగించి స్లాట్లను బ్లాక్ చేస్తారు. 2023లో బీ1, బీ2 అపాయింట్‌మెంట్లకు 999 రోజుల మార్కును చూపించింది. దీంతో అక్రమదారులను అడ్డుకోవడమే ప్రదాన లక్ష్యంగా అమెరికా ముందుకు వెళ్తుతుంది.