HomeNationalSTALIN-YOGI: హిందీ వివాదంపై యోగి- స్టాలిన్ మాటల యుద్ధం

STALIN-YOGI: హిందీ వివాదంపై యోగి- స్టాలిన్ మాటల యుద్ధం

Published on

spot_img

జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్‌ బ్లాక్‌ కామెడీలా ఉందని స్టాలిన్ ఎద్దేవా చేశారు

ఓటు బ్యాంకు ప్రమాదంలో పడింది కాబట్టే స్టాలిన్‌ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శించారు. యోగిజీ మాకు పాఠాలు నేర్పాలనుకుంటున్నారా..? మమ్మల్ని వదిలేయండి. ఇది రాజకీయంగా అత్యున్నతస్థాయి డార్క్‌ కామెడీ. మేము ఏ భాషను వ్యతిరేకించం. కానీ బలవంతంగా రుద్దడాన్ని అంగీకరించం. ఇది న్యాయం కోసం జరుగుతోన్న పోరాటం అని కౌంటర్ ఇచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తోన్న రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయి అని, ఆ విషయాన్ని మీరు గ్రహించకపోవడం దురదృష్టకరం అంటూ…. స్టాలిన్ పోస్ట్‌పై భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స్పందించారు.

దేశవ్యాప్తంగా …జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోంది. కొత్త విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని… అందులో రెండు భారతీయ భాషలుండాలని… కేంద్ర ప్రభుత్వం అంటుండగా.. హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

Latest articles

WEATHER: తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

More like this