భారత్ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) పై అమెరికా ఆంక్షలు విధించాలని…. ‘ది యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్’అనే సంస్థ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణమని ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.
అంతే కాకుండా… భారత్‌పై మరిన్ని ఆరోపణలు చేసింది. మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ….. మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా భారత్‌ను ప్రకటించాలని సూచించింది. 2024లో కూడా… మైనార్టీలపై మతపరమైన వేధింపులు, దాడులు జరిగాయని పెర్కొంది.
ఈ సంస్థ ఇచ్చిన నివేదికను, సూచనలను ట్రంప్ కార్యవర్గం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన ఏమీ లేదు. వియత్నాంలోని కమ్యూనిస్ట్ పాలకులను కూడా ఈ కమిషన్ నివేదిక లక్ష్యంగా చేసుకొంది. మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని పేర్కొంది. ఆ దేశాన్ని ఆందోళనకర జాబితాలో చేర్చాలని పేర్కొంది. భవిష్యత్తులో ట్రంప్
ప్రభుత్వం (రా) పై ఏ నిర్ణయం తీసుకుంటుందో… చూడాలి