HomeAndhra PradeshPastor Praveen Pagadala : మతోన్మాదులకు అడ్డాగా మారిన ఏపీ..!

Pastor Praveen Pagadala : మతోన్మాదులకు అడ్డాగా మారిన ఏపీ..!

Published on

spot_img

* కూటమి కట్టి ఏపీలో పాగా వేసిన బీజేపీ, ఆరెస్సెస్

* సనాతన ధర్మం పేరుతో జనం మధ్య చిచ్చులు..

* పాస్టర్ ప్రవీణ్ పగడాలది పధకం ప్రకారమే హత్య?

* పవన్ కల్యాణ్, రాధా మనోహర్ దాస్ వ్యాఖ్యలే కారణమా?

– బళ్ల రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

ఏపీ మరో యూపీ కాబోతుందా..? మణిపూర్ లో జరిగిన మారణహోమాలు, మత విధ్వంసాలు ఏపీలో ఇక మొదలైనట్టేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అంతేకాదు.. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేనతో కూటమి కట్టిన బీజేపీ.. ఎలాగైనా ఏపీలో పాగా వేయాలని ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. తాజా ఎన్నికల్లో ఏం చేశారో, ఏమో.. ప్రజల అంచనాలను తలకిందులు చేసేలా ఫలితాలొచ్చాయి. ఎలాగైనా అధికారం దక్కించుకున్నాక.. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విషయాన్ని గాలికొదిలేసి.. రాష్ట్రంలో మత విధ్వేషాలు, ప్రతిపక్షాలపై దాడులు, అక్రమ కేసుల పైనే దృష్టిపెట్టింది బీజేపీ, ఆరెస్సెస్ కనుసన్నల్లో నడుస్తున్న కూటమి సర్కార్.

పవన్ కల్యాణ్, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్లు తిరుమల లడ్డూ వివాదంతో మొదలుపెడితే… సనాతన ధర్మం పేరుతో జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో మతోన్మాదం పెచ్చరిల్లినట్టే.. ఏపీలోనూ మతోన్మాద చర్యలు రోజురోజుకూ పెరిగిపోయాయి. అందులో భాగంగానే రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను పథకం ప్రకారం హతమార్చారని క్రైస్తవ సంఘాలు, పలువురు మేధావులు చెబుతున్న మాట. బీజేపీ, ఆరెస్సెస్ చంకలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు రాష్ట్రంలో జరిగే పరిణామాలపై నోరు విప్పకుండా సనాతన ధర్మం అంటూ భజన చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం తీరుపై జనం మండిపడుతున్నారు.

రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఘటన.. ఒక్క తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు.. యావత్ దేశాన్నే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని.. ఆయన్ని మతోన్మాదులు హత్య చేసి, రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆయన ఫాలోవర్స్ అంటున్నారు. క్రైస్తవ సంఘాలు సైతం.. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి.. దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్… కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యాక ఇంతవరకూ ఏ సమస్యనూ పట్టించుకున్నది లేదు. అధికారంలోకి రావడమే ఆయన వేషంతోపాటు మతాలు మారాయి.. సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. చెప్పే మాటకు చేసే పనికీ పొంతన లేకుండా పోయింది. సనాతన ధర్మం పేరుతో వేదాంతాలు వల్లించారు. మతోన్మాదిలా మారిపోయి.. హిందూవాదంతో జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఇవాళ పాస్టర్ ప్రవీణ్ హత్యకు కారణమని కేఏ పాల్ లాంటి మేధావులు ఆరోపిస్తున్నారు.

ఒకవేళ కేఏ పాల్ లాంటి మత పెద్దలు చెబుతున్నది నిజమే అయితే…ఏపీలో మిగిలిన మతాల ప్రజలకు ఇక స్వేచ్ఛలేనట్టేనా..? మతోన్మాదం పెచ్చరిల్లిపోతుందా..? క్రైస్తవులపైనా, మైనారిటీలపైనా దాడులు, హత్యలు పెరిగిపోతాయా..? అన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ మతోన్మాదుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జనం ఏం చేయాలి..? రాజకీయ పార్టీలు, లౌకిక వాదులు, మేథావులందరితో కలిసి ఐక్య పోరాటాలు చేయక తప్పదా..? కూటమి మాటున దాగిన మతోన్మాదులను తరిమికొట్టాల్సిందేనా..? లేకుంటే రోజుకో హత్య, రోజుకో దాడి, రోజుకో అఘాయిత్యంతో ఏపీ మరో యూపీ కావడం ఖాయం. మరి ఏపీ ప్రజలంతా మతోన్మాదులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Latest articles

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

More like this

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...