భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ 5 భవనం కుప్పకూలడంతో అరుగురు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లేనర్ లతో శిధిలాలను తొలగిస్తున్నారు. గాయపడ్డవారిని దగ్గరలోని అసుపత్రికి తరలించారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో జీ ప్లస్ 2 కు మాత్రమే పర్మిషన్ ఉన్నప్పటికీ జీ ప్లస్ 5 నిర్మాణం చేపట్టడం జరిగింది. భవన యజామాని పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.