వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వివిధ విభాగాల్లో భారీ మార్పులు చేపడుతూనే ఉన్నారు. తాజాగా ఎన్నికల ప్రక్రియలో
భారీ మార్పులకు సిద్దమయ్యారు. ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…స్వయం పాలనలో మనం ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నాం. అయినప్పటికీ…. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నికల ప్రక్రియలో అనుసరిస్తున్న….నిబంధనలు అమలు చేయడంలో యూఎస్ విపలమైందని తెలిపారు. భారత్ , బ్రెజిల్ వంటి దేశాలు ఓటరు గుర్తింపునకు బయోమెట్రిక్ ను డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయన్నారు. అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోందని తెలిపారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాలి. యూఎస్ పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి. ఎన్నికల సమయంలో… అమెరికా పౌరులు కానీ, వ్యక్తులు కానీ విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.