కృష్ణాజిల్లా: ఉయ్యూరు పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ యొక్క విధి విధానాలు గురించి జిల్లా ED మరియు డైరెక్టర్లను, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్యను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇంకా అభివృధి పథంలో ముందుకు వెళ్ళాలని శ్రీదేవి సూచించారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పరిష్కరిస్తానని వారకి భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో షాపింగ్ కాంప్లెక్స్ యాజమాన్యం, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.