కృష్ణాజిల్లా: SC సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉడుముల నరేష్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గం పరిధిలోని గూడూరు మండలం మెయిన్ రోడ్డుపై ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మోసం మునియ్య, అట్లూరి శ్రీను, ఉడుముల పుల్లయ్య పెనుముచ్చా అశోక్, జయరాజు అట్లూరి గోవిందు, యువరాజు అంజయ్య, యామవరపు వెంకటేశ్వరావు , కోటయ్య పొలిమేట్ల, రమేష్ ఉడుముల వంశీ తదితరులు పాల్గొన్నారు