ఏఐసీసీ పచ్చజెండా ఉపడంతో ఎట్టకేలకు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు మోక్షం లభించింది. కొత్త మంత్రులు ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆశావహులకు ఇది తీయని కబురని చెప్పవచ్చు. మొత్తం ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా… నాలుగు మంత్రి పదవులు మాత్రమే భర్తీ చేయనున్నారు. ఇందులో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇంకొన్నాళ్ళు వరకు రెండు మంత్రి పదవులు ఖాళీ వుండే అవకాశం వుంది
ఇప్పటికే రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రి వర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా చేపట్టనున్నట్లు తెలుస్తుంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు దక్కే చాన్స్ ఉంది. ఈ విడతలోనే డిప్యూటీ స్పీకర్ ను , చీఫ్ విప్ ను ఎంపిక చేసే అవకాశం వుంది.
ఇక మంత్రి వర్గంలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి, బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌లకు, ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.