హైదరాబాద్ : MMTS రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిని గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు . నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. అతని ఫొటోను పోలీసులు బాధితురాలికి చూపించారు. అత్యాచారయత్నం చేసింది అతనేనని యువతి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఏడాది క్రితమే మహేష్ ను భార్య వదిలివేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన పాత నేరస్థుడని పోలీసులు తెలిపారు.
పోలీసులు 4 బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఉన్న అన్ని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి అనుమానితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది.