HomeAndhra PradeshSHARMILA:పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు...? :షర్మిళ

SHARMILA:పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు…? :షర్మిళ

Published on

spot_img

విజయవాడ: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పక్కనున్న రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనంపై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని… దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ రూ. 109.60 పైసలు, డీజిల్ రూ 97.47 పైసలుగా ఉండగా…పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ రూ.100.86 పైసలు, డీజిల్ రూ.92.39పైసలని తెలిపారు. తమిళనాడుతో పోల్చితే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ ఉందన్నారు. కర్ణాటకలో లీటరు పెట్రోల్ రూ.102.90పైసలు, డీజిల్ రూ.88.99పైసలు ఉందని.. కర్ణాటకతో పోల్చినా… ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 , డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పారు.

ఇక తెలంగాణలో లీటరు పెట్రోల్ . రూ 107.46పైసలు, డీజిల్ రూ. 95.70పైసలుగా ఉందన్నారు. తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనంగా ఉందని చెప్పుకొచ్చారు షర్మిళ . పన్నులు అధికంగా వసూలు చేసినప్పటికీ అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నుల తగ్గింపు విషయంలో టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా…. అధికారపక్షంలో ఉన్నాప్పుడు మరోలాగా ఉంటాయాన్నారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

గత 5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల మేరకు ఇంధనం మీద అదనపు పన్నులు వసూలు చేశారన్నారు షర్మిళ . 10 ఏళ్లలో ప్రజల నుంచి రూ.50 వేల కోట్లు బాదేశారన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని…లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారని… ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this