న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి కలిశారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశువైద్య విశ్వవిద్యాలయాల గురించి ఆయన నిర్మలా సీతారామన్ తో చర్చించారు. వీటికి సంబంధించి 50% నిధులు ఇవ్వడానికి కేంద్రంగా సిద్ధంగా ఉందని ఆమె ఈ సందర్భంగా ఎంపీకి తెలిపారు.