న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి భేటీ అయ్యారు. ఆయనతోపాటు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పలువురు కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కులగణన లెక్కల గురించి చర్చించారు. జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామస్థాయికి.. బూత్ లెవల్ లో ప్రతి గడప గడపకు “ జై బాపు జై భీమ్, జై సామ్‌విద్దన్” కార్యక్రమం గురించి, కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి ఖర్గేకు ఎంపీలు వివరించారు.