* కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఇవాళ కలిశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు విమానాశ్రయం కావాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. దీనికి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు.