హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కోరడా ఝుళిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా…విచారణకు హాజరై వివరణ ఇచ్చుకుంటాన్నారు. తాజాగా ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల
ఎదుర తన లాయర్ తో కలిసి విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు విచారణ కొనసాగింది.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని… విషయం కోర్టులో ఉండడం వల్ల ఈ సమయంలో దీనిపై మాట్లాడడం సరికాదని అన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని, చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పేనని.. దీనివల్ల నష్టపోయిన కుటుంబాల లోటు తీర్చలేమని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని శ్యామల స్పష్టం చేశారు. అయితే తన పై నమోదైన కేసును కొట్టివేయాలని ముందస్తుగా పిటిషన్ దాఖలు చేయడంతో … అమెను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.