HomeCrimeCrime News: నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో..

Crime News: నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో..

Published on

spot_img

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. ఇన్ఫోసిస్ సమీపంలోని కల్పదరు ప్రాజెక్టులో యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి రియాకుమారిపై వెస్ట్ బెంగాల్ కు చెందిన సైకో హేమ్ బ్రోమ్ అతి దారుణంగా బీరు సీసాతో దాడి చేశాడు. దాడి అనంతరం పారిపోతున్న క్రమంలో చూసిన ప్రత్యక్ష సాక్షులు, స్థానికంగా ఉన్న జనాలు ఆ సైకోను పట్టుకొని చితకబాదారు, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

సైకో దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రియాకుమారిని తల్లిదండ్రులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి రాత్రి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల చేతిలో తన్నులు తిన్న సైకో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this