* మార్కాపురంలో కలకలం..
ప్రకాశం జిల్లా మార్కాపురంలో 80 పాము పిల్లలు బయటపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మార్కాపురం పట్టణ శివారులో 15 రోజుల క్రితం రెండు పాములు గుడ్లు పెట్టినట్టు స్థానికులు స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ 120 పాము గుడ్లను సేకరించి ఫారెస్ట్ ఆఫీసులో భద్రపరిచారు. ఈ రెండు పాములకు చెందిన ఆ గుడ్లను వేర్వేరు డబ్బాల్లో ఇసుకలో ఉంచి పొదిగిస్తే…వాటిలో 80 పాము పిల్లలు బయటకు వచ్చినట్టు స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు.