HomeCrimeChhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్లు... 22 మంది మావోయిస్టుల మృతి!

Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్లు… 22 మంది మావోయిస్టుల మృతి!

Published on

spot_img

ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్-దంతెవాడ జిల్లాల‌ స‌రిహ‌ద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగాయి. బీజాపూర్, కాంకెర్ జిల్లాలో జ‌రిగిన రెండు ఎన్‌కౌంట‌ర్ల‌లో 22 మంది మావోయిస్టులతోపాటు ఓ జవాను కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

బీజాపూర్-దంతెవాడ జిల్లాల‌ స‌రిహ‌ద్దు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో గురువారం ఉద‌యం నుంచే కూంబింగ్ చేప‌ట్టాయి. ఈ క్రమంలో మావోలు ఎదురుపడి కాల్పులు జ‌రిపారు. దాంతో వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఘటనాస్థలి నుంచి 18 మంది మావోయిస్టుల‌ మృతదేహాలతో పాటు తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. అయితే, ఈ ఎద‌రుకాల్పుల్లో ఓ జ‌వాను ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఇక ఇదే స‌మ‌యంలో కాంకెర్ జిల్లాలోనూ మ‌రో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. ఇక్కడ బీఎస్ఎఫ్‌, డీఆర్‌జీ బ‌ల‌గాలు సంయుక్తంగా జ‌రిపిన కూంబింగ్ ఆప‌రేష‌న్‌లో న‌లుగురు మావోయిస్టుల‌ను మ‌ట్టుబెట్టాయి. ప్ర‌స్తుతం రెండు జిల్లాల్లోనూ యాంటీ-న‌క్స‌ల్స్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుండ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this