* ప్రభుత్వ ఉద్యోగే కావాలంట..
* వైరల్ అవుతోన్న ఓ యువతి ఫ్రాంక్ వీడియో..
ఓ యువతి తాజాగా సెటైరికల్ గా చేసిన ఫ్రాంక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికూతురిలా ముస్తాబైన ఓ యువతి చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిలబడి.. వచ్చే,పోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా..? అంటూ అడుగుతోంది. కాదనగానే సారీ చెప్పి పక్కకు వెళ్లిపోతోంది. నల్లగా ఉన్నా పర్వాలేదు.. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. దీంతో ఓ మధ్య వయస్సు గల వ్యక్తి ఆమె దగ్గరకి వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంది. అబ్బాయి ఎలా ఉన్నా గానీ, ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని ఆ యువతి చెప్పింది. ఈ ఫ్రాంక్ వీడియోని ఆ యువతి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిదని కామెంట్స్ పెడుతున్నారు.
What is she doing? pic.twitter.com/mNkuhz2whk
— ︎ ︎venom (@venom1s) March 17, 2025