* కేటీఆర్, హరీశ్ రావుతో మల్లన్న మంతనాలు
* బీసీ నేతలతో కలిసి కేటీఆర్‌కు మెమొరాండం
హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు…కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మధ్య తీన్మార్ భేటీ జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని వారిని కోరారు. బీసీ నేతలతో కలిసి కేటీఆర్‌కు మల్లన్న మెమొరాండం అందించారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను కోరారు. ఈ “తీన్మార్” భేటీపై సోషల్ మీడియాలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాథాన్యత సంతరించుకుంది.