AMBATI: చిత్రాడ సభలో పవన్ ప్రవర్తనపై..వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన ఏకి పారేశారు. పవన్ కల్యాణ్ ఊసరవెల్లి లాంటి వాడని, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని ఘాటు విమర్శలు చేశారు.
ఒకప్పుడు తనకు మత, కుల రాజకీయాలంటే అసహ్యమని చెప్పుకున్న పవన్ కల్యాణ్..ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని తన అన్న నాగబాబుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాజకీయాల్లో వారసత్వం పనికిరాదని, కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడంపై చిందులు తొక్కి..ఇప్పుడు ఎలా అన్నకు పదవి ఇచ్చారని నిలదీశారు. కనీసం ప్రజల్లో కూడా తిరగని వ్యక్తికి..MLC పదవి ఎలా ఇస్తారన్నారు. గతంలో నాయకులు ప్రజల్లోంచి పుట్టాలన్న పవన్… ఇప్పుడు ఎమ్మెల్సీని తన అన్నకు ఇచ్చుకున్నాడని ఆరోపించారు.
ఉత్తరాది వారు దక్షిణాదిపై పెత్తనం చలాయించడం ఏంటని గొంతు చించుకున్న పవన్..ఇప్పుడు ఉత్తరాది వారిని కాపాడడం కోసం ఓ సైనికుడిలా తయారయ్యాడని విమర్శించారు. షణ్ముఖ వ్యూహం అంట..అదేంటో తనకు అర్థం కావడంలేదని అంబటి అన్నారు. ఒక్కో వ్యూహం మార్చుకుంటూ వెళుతుండడమేనా షణ్ముఖ వ్యూహం అని ఎద్దేవా చేశారు.
మొదట ఎర్ర కండువా..మళ్లీ కాషాయ కండువా వేసుకున్నారన్నారు. ఎందుకు అలా వ్యూహం మార్చాడనేది, ఎందుకు అలా సిద్దాంతం మార్పు చెందుతూ వచ్చిందనేది చెప్పాలి కదా అని అంబటి ప్రశ్నించారు. ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి కదా? అని అన్నారు. గాలిపటంలా ఎగరడం తప్ప..నిలకడగా ఒక్క చోట కూడా కుదురుగా ఉండలేవా అంటూ చురకలు అంటించారు.