HomeSportsIPL: మరో వారం రోజుల్లో ఐపీఎల్ జాతర

IPL: మరో వారం రోజుల్లో ఐపీఎల్ జాతర

Published on

spot_img

IPL: మరో వారం రోజుల్లో IPL పండుగ షురూ కానుంది. IPL అంటే అటు ప్లేయర్స్ కు, ఇటు ఫ్యాన్స్ కు పండుగే. ఎందుకంటే ఇత‌ర దేశాల టీ20 లీగ్స్ కంటే ఐపీఎల్‌లో ఆడితే అధిక మొత్తం ప్లేయ‌ర్ల‌కు ద‌క్కుతుంది. చెప్పుకోవాలంటే రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కూడా అయిపోవచ్చు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఇంకా ఫ్యాన్స్ కు ఫుల్ మస్తీ. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్.

అయితే ఈ IPL టోర్నీ 2008లో ప్రారంభం కాగా..ఈ ఏడాదితో 18 వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో అంటే 2008 నుంచి 2022 వ‌ర‌కు 8 జ‌ట్లే ఉండేవి. 2023లో మరో 2 కొత్త జ‌ట్లు టోర్నీలోకి చేరాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, గుజ‌రాత్ టైటాన్స్ చేర‌డంతో జ‌ట్ల సంఖ్య ప‌దికి చేరింది.

2008 మొట్టమొదటి సీజన్‌లో షేన్ వార్న్ సార‌థ్యంలోని రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఆ త‌ర్వాత‌ ముంబ‌యి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో 5 టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 3 సార్లు కప్పు దక్కించుకుంది. ఇక GT, SRH, RR, డెక్కన్ ఛార్జర్స్ ఒక్కో టైటిల్‌ గెలుచుకున్నాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు RCB,DC, LSJ మాత్రం ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. టోర్నీ ప్రారంభం నుంచి ఉన్న బెంగ‌ళూరు భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగేది. కానీ చివ‌రికి నిరాశే మిగల్చుతూ ఒట్టిచేతుల‌తోనే వెనుదిరుగుతోంది. అందులోనూ ఈ RCBలో కోహ్లీ లాంటి దిగ్గ‌జ ప్లేయ‌ర్‌ ఉన్నప్పటికీ..కప్పు కొట్టలేకపోతున్నారు. ఏ సాలా కప్ నమ్ దే అంటూ ప్రతీసారి కోహ్లీ..సీజన్ ప్రారంభంలో ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని పంచుతాడు. ఎలా అయినా కప్పు కొట్టేస్తారనుకున్న ప్రతీసారి నిరాశే మిగుల్చుతున్నారు. ఈ జ‌ట్టు ఈసారైనా టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this