* జగన్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు..
* రాజశేఖరరెడ్డికి బంధువు ఎలా అయ్యావు..?
* పార్టీ కోసం నువ్వు ఏ త్యాగం చేయలేదు..
* బాలినేనికి ఒంగోలు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్
ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఒంగోలు వైసీపీ నేతలు. ఒంగోలు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి చందూరి రవిబాబు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇవాళ మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. పార్టీ అధికారంలో ఉంటే ఉంటావు.. లేకుంటే పారిపోయే వ్యక్తివి నువ్వు… వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని ప్రశ్నించారు. “జగన్ కోసం మంత్రి పదవి త్యాగం చేశానంటావా..? రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మంత్రి పదవులు త్యాగం చేసింది కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే. రోశయ్య కేబినెట్లో కూడా మంత్రిగా ఉన్నావు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో నీ మీద నమ్మకం లేక మంత్రి పదవి ఇవ్వలేదు.. అక్కడ మంత్రి పదవి రాదని రెండు నెలల తర్వాత జగన్ దగ్గరకు వచ్చావు.. నువ్వు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని చెప్పావు… మీ సొంతూరు కొణిజేడులో ఒక్క ఎకరం కూడా నువ్వు అమ్మినట్టు ఎవరూ చెప్పడం లేదు.. మీ తండ్రి ఆస్తిని నువ్వు క్లబ్బుల్లో పేకాట, క్యాసినోకి ఖర్చు పెట్టి ఉంటావు..” అని తీవ్ర విమర్శలు చేశారు. పేద బ్రాహ్మణలు, నోరులేని వైశ్యుల జోలికి, వారి మాన, ప్రాణాల జోలికి వెళితే వారి శాపం మీకు తలిగిందని సంచనల వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు పెట్టి.. వారి నుంచి లబ్ధి పొందిన విషయం అందరికీ తెలుసన్నారు. అయితే, ఇంత కాలం కలిసి తిరిగాం కదా అని మేం మాట్లాడటం లేదు. పార్టీ అధినేత జగన్ గురించి మాట్లాడినప్పుడు కూడా మాట్లాలేకపోతే ఎలా?
గతంలో భూముల వ్యహారంలో సిట్ వేస్తే.. అడ్డుకుంది మీరు కాదా? అని నిలదీశారు. మీ వియ్యంకుడు మీకు బినామీ. బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు కూడ గట్టుకున్నావు.. మీరు ఆ పార్టీకి ఏం పనిచేశారని జనసేనలో వాటాలు ఇవ్వాలి..? మీ మాటలకు స్టేజ్ మీద ఉన్న నాయకులు, వీర మహిళలు నవ్వుకున్నారన్నారు. మీ అక్రమ ఆస్తుల మీద ఎంక్వయిరీ వేస్తారనే కదా మీరు పార్టీ మారింది.. మీ మొదటి నుంచి టీడీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారు..గతంలో గొట్టిపాటి రవి, పోతుల రామారావులను పార్టీ నుంచి టీడీపీలోకి పంపావు.. వైవీ సుబ్బారెడ్డిని కోవర్టుగా చూపించి.. డ్రామాలు ఆడుతున్నావని బాలినేనిపై మండిపడ్డారు. మీకు వయసు పెరుగుతుంది.. మిమ్మల్ని అనాలన్నా మాకు సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. అసలు వైఎస్సార్ నీకు బంధువు ఎలా అయ్యారో ఒకసారి గుర్తు చేసుకో.. వైవీ సుబ్బారెడ్డి చెల్లిని చేసుకున్నందుకు నీకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు..అందుకు సుబ్బారెడ్డి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసని, వైవీ సుబ్బారెడ్డి లేకుంటే నీకు టికెట్ కూడా దక్కేదికాదని గుర్తు పెట్టుకోవాలన్నారు ఒంగోలు నేతలు.